VGన్యూస్: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు వెన్నూదన్నుగా నిలుస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఏపీ మంత్రిమండలి తీసుకున్న మరో చారిత్రక నిర్ణయం బీసీలకు రాజకీయ సాధికారతకు గొప్ప అవకాశం కానుందన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం , పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం బీసీలకు జై కొట్టింది.. జయహో బీసీ అంటోందన్నారు.
ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకోవడం కీలకమైన అంశమన్నారు. నగర, పట్టణ, నగర పంచాయతీల్లోని మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇకపై ప్రత్యక్ష పద్ధతిలో చేపట్టాలని, 13 జెడ్పీలను 28 జిల్లాపరిషత్ లు గా ఏర్పాటు చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయాలతో స్థానిక సంస్థల బలోపేతం, పాలనా వికేంద్రీకరణకు గొప్ప ముందడుగు పడిందని మంత్రి లోకేష్ అన్నారు.










