VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. నేడు(బుధవారం) ఢిల్లీలో నిర్వహించే ఎన్డీఏ పక్షాల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కు ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ లు స్వాగతం పలికారు.










