VGన్యూస్: మునగాల మండలంలోని కొక్కిరేణి పాఠశాలలో విద్యార్థులకు రూ.5000 విలువ గల ఉచిత నోటు పుస్తకాలను గ్రామ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన సోదరుడైన దాసరి నరేష్ జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను 11 సంవత్సరాలుగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










