VGన్యూస్: చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మెుదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 158 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ 74 పరుగులు తప్ప మిగతా బ్యాటర్లు రాణించలేదు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 16.4 ఓవర్లలోనే టార్గెను చేధించింది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ కేవలం 46 బంతుల్లోనే 87 పరుగులు చేశారు.










