Home క్రీడలు & సినిమా ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ

VGన్యూస్: సినీ నటుడు విజయ్ దేవరకొండ ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల పరిధిలోని తుమ్మనపేట గ్రామంలో “ది దేవరకొండ ఫౌండేషన్” ఆధ్వర్యంలో విద్యార్థులుకు ఉపకారవేతనల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు పాల్గొని విద్యార్థులుకు స్కాలర్ షిప్ చెక్కులను పంపిణీ చేశారు. అచ్చంపేట డివిజన్ పరిధిలోని 45 ప్రభుత్వ పాఠశాల్లో 9,10వ తరగతుల్లో అధిక మార్కులు సాధించి ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలినచిన 180 విద్యార్థులకు ఉపకారవేతనలను అందజేశారు. ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.10,000, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రూ.5,000 చొప్పున అందజేశారు. ఈకార్యక్రమంలో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, డీఈవో, ఉపాధ్యాయులు, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.