VGన్యుస్: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భాషా సంస్కృతి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కల్వ సుజాత గుప్త మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాసవిమాత జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం అధికారింగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ఆర్యవైశ్యుల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. వాసవిమాత గొప్పతనం, చరిత్రను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్త, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్త, వైశ్యవికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్త, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి కొదుమూరి దయాకర్ రావు, లక్ష్మణ్ ,కూన వెంకట గోపాలకృష్ణ , జయప్రకాష్ గుప్త మరియు ఆర్యవైశ్య నాయకులు, ప్రముఖులు పాల్గొనడం జరిగింది.










