VGన్యూస్: నేపాలీ పని మనుషులతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం సీపీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశారన్నారు. నేపాలీ పనిమనుషులను ఇంట్లో పెట్టుకునే వారు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.







