VGన్యూస్: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్లను కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తో కలిసి కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద దాటికి 19వ గేటు కొట్టుకుపోయింది. ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచన మేరకు రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అధికారులు ఏర్పాటు చేశారు.










