VGన్యూస్: కర్ణాటకలోని హోస్పేట్ సమీపంలోని తుంగభద్ర డ్యామ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్వే గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశయ్యారు. ఈ భేటీలో ఆయా రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. నదీ జలాల విషయంలో మూడు రాష్ట్రాల ఉమ్మడి సమస్యలు, పరిష్కార మార్గాల పై చర్చించినట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.










