Home తాజా వార్తలు నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోషయ్య పేరు పెడతాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోషయ్య పేరు పెడతాం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉందని  ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రోశయ్య గవర్నర్ గా, సీఎంగా ఎన్నో సేవలందించారని గుర్తుచేశారు. బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి మాజీ గవర్నర్, మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పేరు పెడుతాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అలాగే ఆ ఆస్పత్రి సమీపంలో రోశయ్య విగ్రహం ఏర్పాటు చేసి అధికారికంగా జయంతి, వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here