Home తాజా వార్తలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత

VGన్యూస్: బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ(ఆదివారం) ఉదయం హనుమకొండలోని తన నివాసంలో ఆయనకు గుండెపోటు రావడంతో.. వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ బయల్దేరి వెళ్లారు.