Home ఎన్నికలు తమిళనాడులో దుమ్ములేపిన దళపతి

తమిళనాడులో దుమ్ములేపిన దళపతి

VGన్యూస్: తమిళనాడులో టీవీకే పార్టీ సంచలనం సృష్టించింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ తన సత్తాచాటాడు. పార్టీ స్థాపించిన రెండేళ్లలోనే తమిళ ప్రజల చేత విజిల్ మోత మోగించాడు. తమిళనాడు ప్రజలు సినీ ప్రముఖులను ఎంతగా ఆదరిస్తారో మరోసారి తమ ఓటు ద్వారా స్పష్టంగా తెలియజేశారు. గతంలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్, జయలలిత వంటి వారికి ఆ రాష్ట్ర సీఎం గా పనిచేసే అవకాశం కల్పించారు. ఇప్పుడు జననాయగన్ ను జననాయకన్ చేశారు. సోమవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సినీ నటుడు విజయ్ కు చెందిన టీవీకే పార్టీ 107 అసెంబ్లీ స్థానాల్లో విజయ దందుభి మోగించింది. తమిళనాడులో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసిన తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించాడు.
డీఎంకే పార్టీ 60 స్థానాల్లో విజయం సాధించింది.అన్నాడీఎంకే అభ్యర్థులు 47 శాసనసభ నియోజవర్గాల్లో గెలిచారు. కాంగ్రెస్ 05, పీఎంకే 04, ఐయూఎంఎల్ 02, సీపీఐ 02, వీసీకే 02, సీపీఐ(ఎం) 02, బీజేపీ 01 స్థానంలో విజయం సాధించారు.