Home తెలంగాణ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే

VGన్యూస్: కోదాడ మండలం గుడిబండ గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారు పసుపులేటి వీర లక్ష్మీ నరసింహ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గ్రామం ఇందిరమ్మ ఆదర్శ గ్రామంగా ఎంపికైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.