VGన్యూస్: కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం లోక్ భవన్ లో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ (Thawar Chand Gehlot) ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి,సుఖ్విందర్ సింగ్ సుఖు, వీడీ సతీశన్, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.










