Home జాతీయం & అంతర్జాతీయం యువత భవిష్యత్తే.. దేశ భవిష్యత్ : సీఎం రేవంత్ రెడ్డి

యువత భవిష్యత్తే.. దేశ భవిష్యత్ : సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: జై జవాన్, జై కిసాన్, జై యువ నినాదంతో ముందుకుసాగాల్సిన తరుణం ఆసన్నమయిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. యువ భారతమే ప్రపంచం దిశను నిర్దేశిస్తుందని తెలిపారు. 21 ఏళ్లకే యువతకు శాసనసభ, లోకసభ, 25 ఏళ్లకే శాసన మండలి, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే సివిల్ సర్వీసులకు ఎన్నికవుతున్న యువత.. చట్టసభల్లో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు నాయకత్వం వహించడంతో పాటు వ్యాపార, సాంకేతిక రంగాల్లోనూ యువత తమ సత్తా చాటుతోందన్నారు. అందుకే తమ కొత్త నినాదం.. జై జవాన్(Jai Jawan), జై కిసాన్(Jai Kisan), జై యువ(Jai Yuva) అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.