తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగించి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై బీజేపీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకస్తున్నామని ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. ఇది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఒక అవివేకపు చర్య అని పేర్కొన్నారు. తెలుగు యూనివర్సిటీ అంటేనే గుర్తుకు వచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్పు గురించి రాష్ట్ర సర్కారు పునరాలోచన చేయాలనీ సూచించారు. పొట్టి శ్రీరాములు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాదని, దేశం గర్వించే మహనీయులలో ఒకరని తెలిపారు.
Home తాజా వార్తలు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు అవివేకమైన చర్య: ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్త