Home తాజా వార్తలు పదేళ్ల ఎదురు చూపులకు..15 నెలల్లో పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

పదేళ్ల ఎదురు చూపులకు..15 నెలల్లో పరిష్కారం: సీఎం రేవంత్ రెడ్డి

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ తొలి ఏడాదిలో 57,924 ఉద్యోగాలిచ్చిన ప్రభుత్వాలు లేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో కారుణ్య, ఇతర నియామకాల కింద 922 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామకాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక మోడల్ గా నిలబడిందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా మీకు చెందాల్సిన ప్రభుత్వ ఉద్యోగాలు.. గత ప్రభుత్వం దాదాపు 2015 నుంచి కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో జీవితంలో అత్యంత విలువైన మీ సమయం కాలగర్భంలో కలిసిపోయిందన్నారు.

“దశాబ్ద కాలం అవకాశాల కోసం ఎదురుచూసిన మీ కల నెరవేరుతోంది. ఇదొక అనిర్వచనీయ సందర్భం. ఉద్యోగాల్లో చేరుతున్న మీ అందరికీ అభినందనలు. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యే అవకాశం వచ్చింది. జీవిత కాలం గుర్తుండిపోయే సందర్భం. తెలంగాణను ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవడంలో మీరంతా భాగస్వాములు కావాలి” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న అభ్యర్థులకు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here