Home క్రీడలు గుజరాత్ పై ముంబై విజయం

గుజరాత్ పై ముంబై విజయం

VG న్యూస్: అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. మెుదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. తిలక్ వర్మ 45 బంతుల్లోనే సెంచరీ(101*) చేశారు. ఆతర్వాత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు తప్ప ఏ ఒక్కరూ రాణించలేదు. ముంబై బౌలర్ అశ్వని కుమార్ 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు.