VG న్యూస్: శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం “వైశాఖ శుక్ల పక్ష దశమి” నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే అధికారికంగా వాసవి మాత జయంతిని జరపాలని జీవో నెంబర్ 67 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సంవత్సరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఏప్రిల్ 26వ తేదీన వస్తోంది. యువజన అభివృద్ధి,పర్యాటక మరియు సాంస్కృతిక శాఖను నోడల్ శాఖగా నియమించడం జరిగింది. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ కల్వ సుజాత గుప్తతో పాటు పలువురు ఆర్యవైశ్య నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో…










