Home తాజా వార్తలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: కల్వకుంట్ల కవిత

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: కల్వకుంట్ల కవిత

VG న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను తీర్చి సమ్మెను విరమింపచేపియాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సర్కారును డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పంతాలు, పట్టింపులకు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం లేదని చెప్పడానికి శిక్షణ లేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపిస్తుండటంతో కరీంనగర్ జిల్లాలో లారీని బస్సు ఢీకొని పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారన్నారు.