దేవాదాయ చట్ట సవరణ బిల్లుపై మంగళవారం శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం ఉన్న దేవాలయాలకు ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసే వెసులుబాటును కల్పించామని బిల్లులో చెప్పారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ ఆలయానికి రూ.127 కోట్లకు పైగా ఆదాయం వస్తోందన్నారు. కాబట్టి వేములవాడ దేవస్థానానికి కూడా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని హరీష్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.