Home తాజా వార్తలు జలమండలి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా

జలమండలి కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నా

VGన్యూస్: ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయం వద్ద తాగునీటి సమస్యలపై శనివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. జంటనగరాల్లో నెలకొన్న తాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.