Home క్రీడలు & సినిమా భారీ వర్షం.. తొలి టీ20 మ్యాచ్ రద్దు

భారీ వర్షం.. తొలి టీ20 మ్యాచ్ రద్దు

VGన్యూస్: ఇంగ్లాండ్, భారత్ మధ్య బుధవారం జరిగిన మెుదటి టీ20 మ్యాచ్ ను భారీ వర్షం కారణంగా రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. టాస్ గెలిచి మెుదట బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లను కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆ తర్వాత వెంటనే వర్షం ప్రారంభమైంది. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. జూలై 4న మాంచెస్టర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.