VGన్యుస్: తెలంగాణ భవన్ లో సోమవారం బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పాల్గొన్నారు.







