VG న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నలుగురు అధికారులతోకూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రధానంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మికుల ప్రధాన సమస్యలు తదితర అంశాలపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు, ఉద్యోగులతో చర్చించనుంది. ఆతర్వాత కమిటీ ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ కమిటీ కాలపరిమితి నాలుగు వారాలు.








