Home క్రీడలు & సినిమా రంగారెడ్డి రైజర్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం

రంగారెడ్డి రైజర్స్ పై హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం

VGన్యూస్: టీజీ20(TG20) లీగ్ లో గురువారం రంగారెడ్డి రైజర్స్ , హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయం సాధించింది. మెుదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రంగారెడ్డి నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి 195 పరుగులు చేసింది. రంగారెడ్డి బ్యాటర్లు ఆదిత్య జివ్వాజి 58, అవనీశ్ 53 పరుగులతో రాణించారు. 196 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టు కేవలం 18 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. హైదరాబాద్ కెప్టెన్ అభిరథ్ రెడ్డి కేవలం 45 బంతుల్లోనే 99 పరుగులు చేసి హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.