VG న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు(90) ఈరోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భాస్కరరావు మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. భాస్కరరావు 1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నెలపాటు సీఎంగా పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు. మనోహర్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ గా కూడా పనిచేశారు.







