Home తాజా వార్తలు ‘తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

‘తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి’

VGన్యూస్: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమ కమిటీని సూర్యాపేట జిల్లా పూర్వ తుంగతుర్తి మండల  తెలంగాణ ఉద్యమ నాయకుడు దుగ్యాల రవీందర్ రావు కోరారు. శుక్రవారం హైదరాబాదులోని తెలంగాణ అమర జ్యోతి కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ, వరంగల్ , ఖమ్మం జిల్లాల ఉద్యమకారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ.. కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు, కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి లకు వినతి పత్రాలను అందించడం జరిగిందన్నారు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని పేర్కొన్నారు. అర్హులైన ఏ ఒక్క  తెలంగాణ ఉద్యమకారునికి అన్యాయం జరగొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి మండల తెలంగాణ ఉద్యమ నాయకులు  SK జానీ, బుద్దా ప్రవీణ్, వర్దేల్లి మహేష్, మేడుదుల లింగరాజు, ఎశమల్ల భాగ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.