Home తాజా వార్తలు నాగర్‌కర్నూల్ నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ నూతన బస్ స్టేషన్‌కు శంకుస్థాపన

VGన్యూస్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్ స్టేషన్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం నాగర్‌కర్నూల్ నుంచి వనపర్తి వరకు కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించి, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని కూడా మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి, అక్కడి వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.