VGన్యూస్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పంపిణీ చేశారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్ పహాడ్, సూర్యాపేట అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు రూ.1,50,17,400 కోట్ల విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వంగవీటి రామారావు, సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ మెురిశెట్టి నివేదిత లక్షాది, సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణా రెడ్డి తదితరలు పాల్గొన్నారు.










