Home తాజా వార్తలు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ నాగబాబు నియామకం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఎమ్మెల్సీ నాగబాబు నియామకం

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనం, అటవీ విస్తీర్ణం, పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రిచ్‌మెంట్ (ఏపీ గ్రీన్)’ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబును నియమిస్తూ రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నాగబాబుకు క్యాబినెట్ హోదా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.