Home ఆధ్యాత్మికం గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

గణపతి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

VGన్యూస్: రాష్ట్ర ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించి.. విజయాలను అందించే విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్‌ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా గణపతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుని దివ్య ఆశీస్సులతో ప్రజల జీవితాల్లోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.