VGన్యూస్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్, ఆచార్య కోదండరాం సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారి చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.







