VGన్యూస్: ఇటీవల కర్ణాటక సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్యకు కాంగ్రెస్ అధిష్ఠానం సముచిత స్థానం కల్పించింది. ఆయనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తోందిని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక నూతన సీఎంగా డీకే శివకుమార్ బుధవారం సాయంత్రం బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.










