Home జాతీయం & అంతర్జాతీయం ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి

ఏపీ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి

VGన్యూస్: ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం గౌరవ అధ్యక్షురాలుగా శిద్ధా లక్ష్మీ పద్మావతి ( మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు సతీమణి) నియమితులయ్యారు. ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య ఈ నియామక పత్రాన్ని వారి స్వగృహంలో అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ.. శిద్ధా లక్ష్మీ పద్మావతి నియామకం ద్వారా ఆర్యవైశ్య మహిళా విభాగం మరింత బలోపేతం అవుతుందన్నారు. మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు దంపతులను మహాసభ అధ్యక్షులు ఇల్లూరు లక్ష్మయ్య సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు , శ్రీశైలం దేవస్థానం కార్యవర్గ సభ్యులు దేవకి వెంకటేశ్వర్లు , మహాసభ ఉపాధ్యక్షులు దర్శి వాసు పాల్గొన్నారు.