Home జాతీయం & అంతర్జాతీయం తెలంగాణలో రాబోయే కాలం బీజేపీదే: నితిన్ నబీన్

తెలంగాణలో రాబోయే కాలం బీజేపీదే: నితిన్ నబీన్

VGన్యూస్: తెలంగాణ పుణ్యభూమిపై కూడా కమల వికాసం కాబోతోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నబీన్ పాల్గొని మాట్లాడుతూ.. తమ లక్ష్యం ఒక్కటే.. వికసిత భారత్, తమ సంకల్పం ఒక్కటే.. వికసిత తెలంగాణ, తమ నమ్మకం ఒక్కటే.. బీజేపీ విజయమన్నారు. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదు.. దేశమే ముందు అనే సిద్ధాంతంతో, త్యాగాలు మరియు ఆదర్శాల పునాదుల మీద సాగుతున్న ఒక పవిత్ర యాత్ర అని నితిన్ నబీన్ పేర్కొన్నారు. 1980లో మొదటి ఎన్నికల్లో కేవలం ఇద్దరు ఎంపీలతో మొదలై, నేడు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందంటే.. దానికి ఏకైక కారణం అహర్నిశలు శ్రమిస్తున్న బూత్ స్థాయి కార్యకర్తలే అని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నవ భారత నిర్మాణం జరుగుతోందన్నారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని చిట్టచివరి వ్యక్తికి కూడా చేరుతున్నాయని పేర్కొన్నారు.