VGన్యూస్: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముస్కు శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో రెండవ సారి అధ్యక్షుడిగా నియామకానికి సహకరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి , ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, కార్యకర్తలందరినీ కలుపుకొని పోతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు.










