VGన్యూస్: చెరువుగట్టు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో దుకాణాలు, ఇళ్లు పూర్తిగా దగ్ధమై తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అండగా నిలిచింది. గురువారం మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ బాధితులైన రంగా శ్రవణ్ కుమార్ కు రూ.1,00,000/- మరియు కర్నాటి ఎల్లయ్యకు రూ.1,00,000/- చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.మల్లికార్జున్ గారు, కోశాధికారి గణేష్ గుప్త, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇరుకుల్ల రామకృష్ణ, కోఆర్డినెటర్ చింతల రవి కుమార్, నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు తేలుకుంట్ల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.







