Home ఆధ్యాత్మికం లష్కర్ బోనాలకు గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి సురేఖ

లష్కర్ బోనాలకు గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి సురేఖ

VGన్యూస్: సికింద్రాబాద్‌లో నిర్వహించనున్న ఆషాడ బోనాల (లష్కర్ బోనాలు) ఉత్సవాలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. గురవారం లోక్ భవన్ లో గవర్నర్ కు ఆహ్వాన పత్రికను మంత్రి సురేఖతో కలిసి ఉజ్జయిని మహంకాళి దేవస్థాన ప్రధాన అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఈవో, అసిస్టెంట్ కమిషనర్ మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.