Home క్రీడలు & సినిమా రెండు స్వర్ణాలతో అదరగొట్టిన ధీరజ్

రెండు స్వర్ణాలతో అదరగొట్టిన ధీరజ్

VGన్యూస్: ఆర్చరీ ప్రపంచ కప్ లో రెండు స్వర్ణ పతకాలతో తెలుగు క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌ అదరగొట్టాడు. ఆర్చరీ వరల్డ్‌ కప్‌ స్టేజ్‌-3 టోర్నీలో వ్యక్తిగత, మిక్స్‌డ్‌ విభాగాల్లో పసిడి పతకాలు సాధించిన తొలి భారత పురుష ఆర్చర్ గా చరిత్ర సృష్టించాడు. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో కుంకుమ్‌ మొహోద్‌తో కలిసి మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్‌ విభాగంలో కూడా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ఆర్చరీలో తిరుగులేని స్థానంలో ఉన్న దక్షిణ కొరియాకు చెందిన లీ వూ సియోక్‌పై ఫైనల్లో విజయం సాధించడం ధీరజ్ ప్రతిభకు నిదర్శనం. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌ కు అభినందనలు తెలిపారు.