Home ఆధ్యాత్మికం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వాసవిమాత జయంతి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వాసవిమాత జయంతి

VGన్యూస్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి మాత జయంతి ఉత్సహాన్ని ఘనంగా నిర్వహించారు. ఉప్పల శారద గుప్త ఆధ్వర్యంలో కుంకుమ పూజ, 102 గోత్రాలకు గాను 102 చీరలతో వాసవి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ జీ, చీకోటి ప్రవీణ్ గుప్త, గందె సుధాకర్, సినీ నటి కవిత, పసునూరి శ్రీనివాస్ గుప్త, రంగా నర్సింహ గుప్త, అభిషేక్, ఉప్పల చంద్రశేఖర్, దాసరి చంద్రశేఖర్, ప్రభుగుప్త, శైలజ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.