Home ఆధ్యాత్మికం వాసవిమాత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

వాసవిమాత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

VGన్యూస్: ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి(ఆదివారం ఏప్రిల్ 26,2026) సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ , ముఖ్యంగా ఆర్యవైశ్యులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవి మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని సీఎం ఆకాంక్షించారు. వాసవి మాత చూపించిన సత్య మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున శ్రీ వాసవి మాత జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. భక్తి శ్రద్ధలతో శ్రీ వాసవి మాత ఉత్సవాలను నిర్వహిస్తూ, ధర్మం, నీతి, సేవాభావం వంటి మహత్తర విలువలను మన జీవితాల్లో ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.