యాదగిరిగుట్ట దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం అసెంబ్లీలో తెలిపారు. వైటీడీ బోర్డులో 18 మంది సభ్యులు ఉంటారన్నారు. సభ్యుల పదవీ కాలం రెండు సంవత్సరాలు. అలాగే వీరికి జీతాభత్యాలు ఉండవని పేర్కొన్నారు. కేవలం డీఏలు మాత్రమే ఉంటాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు.