Home తాజా వార్తలు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ కోదండరాం

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్సీ కోదండరాం

VGన్యూస్: జూన్ 25 నుంచి ప్రారంభమయ్యే ఎస్‌ఐఆర్ ప్రక్రియపై తెలంగాణ జన సమితి పార్టీ నేతలు లోతైన దృష్టి కేంద్రీకరించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం సూచించారు. శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. వీలైనంత వరకు ప్రతి పోలింగ్ బూత్‌కు పార్టీ ఏజెంట్లను నియమించాలని జిల్లా అధ్యక్షులను ఆదేశించారు. తెలంగాణలో ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు కూడా కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ అంశంపై అధికార కాంగ్రెస్‌తో పాటు ఇతర అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని కోదండరాం టీజేఎస్ నేతలకు సూచించారు. ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ టీజేఎస్ రాష్ట్ర కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది.