Home తెలంగాణ విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలనకై పాటుపడాలి: ఎస్పీ నరసింహ

విద్యార్థులు డ్రగ్స్ నిర్మూలనకై పాటుపడాలి: ఎస్పీ నరసింహ

VGన్యూస్: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. యువత, విద్యార్థులు దేశాభివృద్ధికి పాటుపడే వనరులుగా ఎదగాలన్నారు. ఉన్నత లక్ష్యాలు ఎంచుకొని వాటి సాధనకై నిరంతరం కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు, యువత సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకై పాటుపడాలని కోరారు. ప్రజలు సైబర్ మోసాల బారిన పడకుండా అపరిచిత వ్యక్తులతో ఓటిపి, పిన్ నెంబర్లు, వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని తెలిపారు. విద్యార్థులు, యువత వాహనాలను వేగంగా నడపవద్దని.. హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్ లాంటివి చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సిఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ. నవీన్ కుమార్, మల్లేష్ కళాశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్, విద్యార్థులు, పోలీసు అధికారులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.