Home తాజా వార్తలు అసైన్డ్ భూములు లాక్కుంటామంటే ఒప్పుకునేదే లేదు: కేటీఆర్

అసైన్డ్ భూములు లాక్కుంటామంటే ఒప్పుకునేదే లేదు: కేటీఆర్

VGన్యూస్: అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక, అదే భూములను లాక్కుంటున్నది కాంగ్రెస్ సర్కార్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. పరిగి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్‌ శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాత్మక మార్గదర్శకాలను పార్టీ శ్రేణులకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పరిగిలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అసైన్ భూములను లాక్కోవడాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పట్టాలు ఇచ్చి, తగిన నష్టపరిహారం చెల్లించి, రైతుల అంగీకారంతోనే భూములు సేకరించాలని డిమాండ్ చేశారు. భూముల అక్రమాలపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లప్పుడు రైతుబంధు పడేది.. ఇప్పుడు ఓట్లప్పుడు రైతుబంధు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, డా. మెతుకు ఆనంద్ మరియు తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.