Home క్రీడలు & సినిమా రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత హైదరాబాద్

రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 విజేత హైదరాబాద్

VGన్యూస్: గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2లో విజేతగా నిలిచిన హైదరాబాద్ హీరోస్ జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ హీరోస్, ముంబై డ్రీమర్స్ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో 41–17 తేడాతో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ హీరోస్ కెప్టెన్ మన్యుయెల్ మొరెనోకు హెచ్ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్–2026 కప్‌ను అందజేశారు. ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్–2 పోటీలు ఆదివారం జరిగిన తుదిపోరుతో ముగిశాయి. ఫైనల్ మ్యాచ్‌ను సీఎంతో పాటు సినీనటుడు చిరంజీవి, రగ్బీ ఇండియా ప్రెసిడెంట్, నటుడు రాహుల్ బోస్, జీఎంఆర్ కార్పొరేట్ ఛైర్మన్ గ్రంధి కిరణ్ కుమార్, క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె. శివసేన రెడ్డి , నటి మృణాల్ ఠాకూర్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరై వీక్షించారు.