Home తాజా వార్తలు నల్గొండను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

నల్గొండను ‘స్మార్ట్ సిటీ’గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి కోమటిరెడ్డి

VGన్యూస్: నార్కట్‌పల్లి – అద్దంకి – మేదరమెట్ల రహదారిపై మర్రిగూడ జంక్షన్‌ వద్ద నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రూ. 65 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నల్లగొండ పట్టణవాసులతో పాటు, ఈ రహదారిపై నిత్యం ప్రయాణించే వేలాది మంది వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని అన్నారు.
అత్యంత రద్దీగా ఉండే మర్రిగూడ జంక్షన్‌లో రోడ్డు ప్రమాదాలను నివారించి, ప్రజలకు సురక్షితమైన అలాగే వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నల్గొండలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనడానికి ఈ ప్రాజెక్టు ఒక ప్రత్యక్ష నిదర్శనమన్నారు. రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా నల్లగొండ ప్రాంత ఆర్థిక మరియు వాణిజ్య వృద్ధికి దొహదపడుతాయన్నారు.