Home ఆధ్యాత్మికం కొండగట్టు ఆలయ గిరిప్రదక్షిణలో పాల్గొన్న మంత్రులు

కొండగట్టు ఆలయ గిరిప్రదక్షిణలో పాల్గొన్న మంత్రులు

VGన్యూస్: గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ గిరిప్రదక్షిణలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులకు పాడి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా ఉండాలని ఆంజనేయస్వామిని ప్రార్థించినట్లు మంత్రులు తెలిపారు.