VGన్యూస్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.







